ఏడాది పాటు బంగారం కొనకండి.. హైదరాబాద్ పర్యటనలో ప్రజలకు మోదీ పిలుపు
పశ్చిమబెంగాల్లో బీజేపీ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నాక తెలంగాణలోనూ ఆ గెలుపు ప్రకంపనలు కనిపిస్తున్నాయని, కాంగ్రెస్, బీఆరఎస్ విశ్వాసఘాతుకం, హామీల అమల్లో వైఫల్యం, కుటుంబ రాజకీయాల పట్ల విసిగిపోయిన తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలో ఇక వచ్చేది భాజపా ప్రభుత్వమే అని ఆయన స్పష్టం చేశారు. ‘భాజపాతోనే వికసిత్ తెలంగాణ సాధ్యమవుతుంది. పేర్కొన్నారు. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో ఇటీవల రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ‘నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా… మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణలో బీజేపీవైపు గాలిమార్పు స్పష్టంగా గోచరిస్తోందన్నారు. ‘అబ్కీ బార్ తెలంగాణ’ అంటూ సభికులతో మోదీ నినాదాలు చేయించారు.
ఈ సమావేశంలో బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం అత్యంత ఖరీదైందిగా మారింది. అందుకే ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయకపోవడం మంచిదన్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడింది. దీంతో పెట్రోల్, డిజీల్ ధరలు తీవ్రంగా పెరిగాయి. గ్యాస్,యూరియా ధరలు అమాంతం పెరిగినప్పటికీ ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో ధరలు పెంచడం లేదు. “ప్రస్తుత కష్ట సమయాల్లో ప్రజలంతా సంయమనం పాటించాలి. విదేశీ ప్రయాణాలు, దుబారా ఖర్చులు పూర్తిగా తగ్గించుకోవాలి. పెట్రోల్, డీజిల్‌ను పరిమితంగా వినియోగించాలి. ప్రజా రవాణానే అధికంగా వాడాలి” అని మోదీ అన్నారు. ప్రజలంతా ఎలక్టిక్ వాహనాల వైపు మళ్లాలని, వాటినే వినియోగించాలని కోరారు. ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని ఉక్రెయిన్- రష్యా యుద్ధం, పశ్చిమాసియా యుద్ధాలతో సరఫరా చైన్ దెబ్బతింది అని మోదీ అన్నారు. ఆ నష్టాన్ని కేంద్రమే భరిస్తోందని తెలిపారు. వంట నూనెలు ఎరువుల మందులను పూర్తిగా తగ్గించాలని పురుగుల మందులు, ఎరువుల వినియోగాన్ని తక్కువ చేయాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దశాబ్దాల కింద బీజేపీకి ఎన్నో రాష్ట్రాల్లో ఆదరణ లభించలేదని, అయితే దేశవ్యాప్తంగా బీజేపీకి రెండుసీట్లు ఉన్నప్పుడు ఒకటి తెలంగాణలో వచ్చిందని గుర్తుచేశారు. ఆ విధంగా బీజేపీ చరిత్రలో తెలంగాణకు ప్రత్యేకస్థానం ఉందన్నారు. ఇప్పుడు దేశం నలుమూలలా బీజేపీపై ప్రజల ఆశీర్వాదం పెరుగుతోందని, బీజేపీ గుడ్‌గవర్నెన్స్ మోడల్‌పై ఎన్నికల్లో ప్రజలు ఓటు ముద్రవేశారన్నారు. తెలంగాణ అలాంటి ప్రదేశమైనందున ఇప్పుడు 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలున్నారని, ఇక అధికారానికి రావడమే తరువాయి అని చెప్పారు. దేశం కోసం చనిపోవడమే దేశభక్తి కాదని.. దేశం కోసం జీవించడం, కర్తవ్యం నిర్వహించడమూ దేశభక్తే అవుతుందని అన్నారు. అభివృద్ధిలో భారత్ వేగంగా ముందుకు వెళ్తోందని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ అవినీతిని పెంచి, కుటుంబ పాలన, రాజ్యాంగ సంస్థల గొంతు కోసే ప్రయత్నం చేసింది. టీఎంసీ కాంగ్రెస్ నుంచి ఈ చెడు లక్షణాలు నేర్చుకుంది. లెఫ్ట్ పార్టీల తప్పుడు పనులు చూసి అలవాటు చేసుకుంది. అక్కడ తానాషాహీ నమూనాలో మొత్తం తోడేళ్లను నింపేసింది. ఆ రాష్ట్ర ప్రజలను బానిస తోడేళ్ల మధ్య బంధించింది. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆ రాజకీయాలను, తానాషాహీ నమూనాను ఓడించారు. ప్రజలు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. ఈ చరిత్రాత్మక విజయం దేశవ్యాప్త ఉత్సవం అయింది. ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ఏ గెలుపుపైనా ఇలాంటి చర్చ జరగలేదు. ఈ ఉత్సాహం తెలంగాణలోనూ కనిపిస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో భాజపాకు ప్రజాదరణ రోజురోజుకీ పెరుగుతోంది. అభివృద్ధి, సుపరిపాలన చూసి ఓటు వేస్తున్నారు. అప్పట్లో భాజపాకు తెలంగాణ అండగా నిలిచింది.
దేశంలో అస్సాం నుంచి ఒడిశా వరకు.. బెంగాల్ నుంచి పుదుచ్చేరి వరకు ఎన్నికల్లో భాజపా విజయం.. భారత రాజకీయాల్లో పెద్దమార్పు. ప్రజలు వంశవాదం, కుటుంబవాదాన్ని కాదని.. విశ్వాసవాదాన్ని ఎన్నుకుంటున్నారు. భాజపా జెండా ఎత్తేందుకు సిద్ధంగా లేనిచోట.. ఇప్పుడు భాజపా ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయి. పదేళ్ల క్రితం అస్సాంలో భాజపాకు కొందరే సభ్యులు ఉండేవారు. ఇప్పుడు వరుసగా మూడోసారి భాజపా, ఎన్డీయే సర్కారు వచ్చింది. పదేళ్ల క్రితం బెంగాల్లో ముగ్గురే ఎమ్మెల్యేలుండగా ఇప్పుడు ఆ సంఖ్య 200 దాటింది. భాజపాకు గతంలో తెలంగాణ గడ్డ అండగా నిలిచింది. అప్పట్లో లోక్‌సభలో పార్టీ ఎంపీలు ఇద్దరు ఉంటే.. అందులో ఒకరు తెలంగాణ నుంచి ఉన్నారు. ఇప్పుడు ఎనిమిది మంది ఉన్నారు. తెలంగాణలో భారీ మెజార్టీతో భాజపా సర్కారు ఏర్పాటవుతుందన్న నమ్మకం పార్టీ కార్యకర్తల్లో, ప్రజల్లో వచ్చింది. బీజేపీ అభివృద్ధి, ఉపాధి కల్పనపై దృష్టి పెడుతుంటే కాంగ్రెస్ మాత్రం ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ‘ప్రస్తుతం దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ సీఎంలు ఉన్నారు. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ మోడల్ ఒకటే. ముందుగా అబద్ధపు హామీలు ఇస్తారు.. ఆకాశం నుంచి చుక్కలు తెంచి ఇస్తామని చెబుతారు. ఆ తర్వాత అంతే సులభంగా వాటిని మరిచిపోతారు’ అని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ తన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని, తెలంగాణలో కూడా అదే జరుగుతోందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతోపాటు పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
మోదీ పొదుపు మాటల వెనుక…
గత వారంలో (10 మే 2026వ తేదీన) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ దేశ ప్రజలకు మూడు సలహాలు ఇచ్చారు.
1. విదేశీ ప్రయాణాలు చేయకండి
2. ఆనవసరంగా బంగారం కొనకండి.
3. వర్క్ ఫ్రమ్ హోమ్ మళ్ళీ మొదలెట్టండి..
వెంటనే రకరకాల కామెంట్స్, జోక్స్ వచ్చాయి. ‘ముందు మీ ఖర్చులు తగ్గించుకోండి’ లాంటి ప్రతిపక్షం వారి చురకలు కూడా వచ్చాయి. కానీ అసలు ఈ సలహాల వెనుక మోడి ఉద్దేశ్యం ఏమిటి? అవి యథాలాపంగా అన్న మాటలా? సీరియస్‌గా దేశ పరిస్థితులను తెలిపే పాలసీ స్టేట్ మెంట్లా?
కాస్త లోతుగా పరిశీలిస్తే… చాలా విషయాలు అర్ధం అవుతాయి. హఠాత్తుగా సామాన్య ప్రజలకి కూడా తెలిసిన హర్మోజ్ జల సంధి (Stతీaఱt శీf Haతీఎశీuఓ) పరిస్థితి చూస్తే… అమెరికా – ఇరాన్ యుద్ధం రాకముందు (అంటే ఫిబ్రవరి 2026 వరకు) ఆ మార్గంలో జరిగిన రాకపోకల సంఖ్య తో పోలిస్తే ఇప్పుడు (మే మొదటి వారంలో) కేవలం 5% మాత్రమే అని తెలుస్తోంది. అంతే కాదు.. దాదాపు 1550 భారీ నౌకలు, 22500 ఎaతీఱఅవతీs ఆ మహా సముద్రంలో చిక్కుకొని ఉన్నారు. వెనక్కి లేదా ముందుకు వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్నారు. మే 4వ తేదీన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అంటూ ఎవరికి ఎలాంటి ఆంక్షలు లేవు అన్నారు. కానీ రెండు రోజులలోనే మే 6 వ తేదీన ఆపేశారు. ఇరాన్ దేశ కొత్త నిబంధనలు ప్రకారం రాకపోకలు ఉంటాయి అన్నారు.
మోర్గాన్ స్టాన్లీ లాంటి ప్రముఖ సంస్థ ప్రస్తుత పరిస్థితి సమీక్షించి 1 మార్చి – 25 ఏప్రిల్ 2026 పీరియడ్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ నిలువలు రోజుకి 4.5 మిలియన్ బ్యారెల్లు ఉన్నాయని, రికార్డు స్థాయిలో తక్కువ రావడం జరిగిందని చెప్పింది.. అదే సమయంలో జెపి మోర్గాన్ సంస్థ ప్రస్తుత పరిస్థితులలో OECD (Organization for Economic Cooperation & Development) – 38 దేశాలు మెంబర్లుగా ఉన్న అంతర్జాతీయ సంస్థ) అంచనా ప్రకారం ప్రస్తుతం హార్మూజ్ జల సంధిలో రాక పోకలు యధావిధిగా జరగకపొతే సెప్టెంబర్ 2026 నాటికి ఈ దేశాలన్నింటిలోని ఆయిల్ నిల్వలు ప్రమాదకరమైన కింద స్థాయి కి వస్తాయని అంచనా వేసింది. ఇప్పుడు వెంటనే హార్మూజ్ సాధారణ స్థితికి చేరుకున్నా అన్ని దేశాలు 2027 లోనే సాదారణ స్థితికి వస్తాయని తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో ప్రధాని చెప్పిన మూడు సూచనలు యధాలాపంగా చెప్పినవి కావని, వాటి వెనుక ఎంతో పరిశోధన – విశ్లేషణ జరిగింది అని తెలుస్తోంది. మన దెస రిజర్వు బ్యాంకలో ఖీశీతీవఞ నిల్వలు 27 ఫిబ్రవరి 2026 న ఉన్న 728.5 billion USD నుంచి 1 మే 2026 నాటికి 890.70 billion USD కి పడిపోయాయి. ఇవి మరింత పడిపోతాయని కూడా అంచనా వేస్తున్నారు. వీటిని ఇంకా కిందకు వెళ్లకుండా ఆపాలి అంటే ఇప్పటికే (8 మే 2026 నాటికి) US డాలర్‌కి రూపాయి విలువ 94.24 అయింది. అదే సమయం లో పెట్రోల్ సంస్థలు IOC, BPCL, HPCL సంస్థలు ప్రతి లీటర్ పెట్రోల్‌కి Rs 18, ప్రతి లీటర్ డీజిల్‌కి Rs 30- Rs 35 దాకా నష్ట బోతున్నారు. భారత ప్రభుత్వం పెట్రోల్ – డీజిల్ ధరలు పెంచమని చెప్పడం వలన ఏప్రిల్ నెల నుంచి రోజుకు సుమారు 1600 కోట్ల రూపాయల నష్టాన్ని పెట్రోల్ సంస్థలు భరిస్తున్నాయి. ఇవి ఇంకా ఎన్నాళ్ళు భరిస్తాయో తెలీదు. ఆ సంస్థలు ధరలను పెంచమని ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టవచ్చు. మే 2026 లోనే పెట్రోల్ ధరలు Rs 2-4 వరకు పెరగవచ్చు అని తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికె Excise duty తగ్గించి కొంత భారం మోస్తోంది కూడా. ఈ విషయంలో Fitch అనే అంతర్జాతీయ రేటింగ్ సంస్థ క్రూడ్ ఆయిల్ ధరలలో వచ్చే మార్పుల కంటే, సప్లై పీరియడ్ లో వచ్చే మార్పుల వలన అనేక దేశాల ఎకనామి దెబ్బ తింటుందని చెపుతోంది,
ఈ నేపథ్యంలో మరి ఒకసారి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మూడు విషయాలు పరిశీలిస్తే (1. విదేశీ ప్రయాణాలు ఒక సంవత్సరం పాటు వాయిదా వేయండి. 2. బంగారం కోనడం కూడా వాయిదా వేయండి 3. వర్క్ ఫ్రొం హోమ్ మళ్ళీ మొదలెట్టండి) Foreign Exchange reservesలలో ముఖ్యమైనవి బంగారం, ఇంటి వస్తువులు, పెట్రోల్… ఈ మూడింటిని దెస ప్రజలకు అందించటానికి ప్రభుత్వం ఏంతో ఖర్చు చేస్తోంది. కొనేది ప్రజలే అయినా, డబ్బులు వారివే అయినా ప్రభుత్వం వాటి సరఫరా కోసం ఏంత శ్రమపడుతోందో, ఎంత ఖర్చు చేస్తోందో ఎవరికీ తెలియదు కదా!
ప్రభుత్వం చేతిలో మూడు ఎంపికలు (options) ఉన్నాయి. Excise duty మళ్ళీ ఇంకో సారి ఇంకా తగ్గించడం, పెట్రోలియం సంస్థలకు ఇంకా సబ్సిడీ ఇవ్వడం, లేదా ప్తెరోల్ ధరలను పెంచడం. సాధారణ పరిస్థితులలో ప్రభుత్వం దాదాపు 170 బిలియన్ US డాలర్ల ఇంపోర్ట్‌తో బంగారం ఇండియాలోకి వస్తోంది. ఇప్పుడు పెరిగిన ధరలలో ఈ అమౌంట్ ఇంకా భారీగా పెరిగి ఉండొచ్చు. ఇంకా ఇంపోర్ట్స్ మీద ఖర్చు పెట్టె బదులు ప్రజలను బంగారం అనవసరంగా కొనకండి అని అడగడం మంచిది కదా! అదేవిధంగా వర్క్ ఫ్రం హోమ్ వలన ఇంటి నుంచి ఆఫీస్‌కు వెళ్లడం – రావడం తగ్గుతుంది, దాని వలన పెట్రోల్ వాడకం తగ్గుతుంది. ఇప్పుడున్న ఆయిల్ నిల్వలు కొంత కాలం వస్తాయి. ఈ లోపల పరిస్థితులు చక్కబడే అవకాశం ఉండవచ్చు కదా! విదేశీ ప్రయాణాలు తగ్గడం, విమాన ప్రయాణాలు తగ్గడం వలన పెట్రోల్ వాడకం తగ్గుతుంది. అందుకని ప్రపంచం లోనే ఒక వింతగా, ఒక ఆదర్శంగా దేశ ప్రధాన మంత్రి 140 కోట్ల ప్రజలనుద్దేశించి ఖర్చులు తగ్గించొకోమని సలహా ఇస్త్తున్నారు.. కోరుతున్నారు.
(వినోద్ శ్రీనివాసన్ సౌజన్యంతో)







