వ్యాపారవేత్తలకు సువర్ణావకాశం.. జూలై 31 నుండి బాల్టిమోర్‌లో ‘ఆటా’ 19వ మహాసభలు!
ATA: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో జూలై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత వైభవంగా జరగనున్న 19వ ఆటా కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్ సందర్భంగా భారీ ఎగ్జిబిషన్ (Vendor Exhibits) ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రదర్శనలో జ్యువెలరీ, చీరలు/బోటిక్, విలువైన రాళ్లు/ముత్యాలు, రియల్ ఎస్టేట్ , ఇతర లాభాపేక్ష లేని సంస్థలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. సుమారు 10,000 కంటే ఎక్కువ మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున, వ్యాపారవేత్తలకు ఇది ఒక గొప్ప వేదిక కానుంది. ఆసక్తి గల వారు vendor@ataworld.org కు మెయిల్ చేయవచ్చు.
వివరాలు..
- వేదిక: బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ (1 W Pratt St, Baltimore, MD 21201).
- తేదీలు: జూలై 31, ఆగస్టు 1 , 2, 2026.
సంప్రదించాల్సినది:
- నవీన్ చల్లా (వెండర్ కమిటీ చైర్): 571-426-6422
- కల్పన బోయిన్పల్లి (కో-చైర్): 571-426-0383
- సురేష్ రెడ్డి వులువల (అడ్వైజర్): 972-571-0308
- డి.వి. కోటి రెడ్డి (అడ్వైజర్): +91 98480 11818
నిర్వహణ కమిటీ ముఖ్యులు:
జయంత్ చల్లా (ప్రెసిడెంట్), శ్రీధర్ బనాలా (కన్వీనర్), రవి చల్లా (కోఆర్డినేటర్), శరత్ వేముల (నేషనల్ కోఆర్డినేటర్), సుధీర్ దమిడి (డైరెక్టర్) , ఇతర సభ్యులు ఈ వేడుకను పర్యవేక్షిస్తున్నారు. మరింత సమాచారం కోసం www.americanteluguassociation.org సందర్శించగలరు.








