Egg Hunt: తానా ఆధ్వర్యంలో గ్రాండ్గా ఈస్టర్ వేడుకలు.. ఏప్రిల్ 12న ‘ఎగ్ హంట్’ సందడి!
TANA: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో చిన్నారుల కోసం ఉత్సాహభరితమైన ‘ఈస్టర్ ఎగ్ హంట్’ (Easter Egg Hunt) వేడుకను నిర్వహించనున్నారు. తెలుగు కమ్యూనిటీ కుటుంబాల మధ్య ఈస్టర్ పండుగ సందడిని పంచుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
వేదిక , సమయం:
ఈ వేడుక ఏప్రిల్ 12, 2026 (ఆదివారం) ఉదయం 9:00 గంటలకు ప్రారంభమవుతుంది. కాలేజ్విల్లేలోని ఇవాన్స్బర్గ్ స్టేట్ పార్క్ (Evansburg State Park, PA) ఈ వేడుకకు వేదిక కానుంది.
ఇవి కూడా చదవండి
విశేషాలు:
ఈ కార్యక్రమంలో పిల్లల కోసం ప్రత్యేకమైన ఆటలు (Games), వినోద కార్యక్రమాలతో పాటు విందు భోజనం (Food) ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా ఉచిత ఈవెంట్ అయినప్పటికీ, పాల్గొనాలనుకునే వారు ముందుగానే RSVP ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
నిర్వాహక బృందం:
తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్ అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కాంతేటి , బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి కోఆర్డినేటర్లుగా దీప్తి కోక, భవాని మామిడి, రవీణ తుమ్మల, అనుష ముసులూరి వ్యవహరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








