ఫిలడెల్ఫియాలో నోరి, జయరాం కోమటిలకు ఘన సన్మానం
ఫిలడెల్ఫియా నగరంలో ఏప్రిల్ 26వ తేదీన ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాంతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు కూడా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి సమన్వయపరిచారు. పెద్దసంఖ్యలో ఎన్నారైలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ అమెరికాలో తెలుగుజాతి ఔన్నత్యానికి, తెలుగు కమÖ్యనిటీ పురోభివృద్ధికి జయరాం కోమటి విశేషంగా కృషి చేశారన్నారు. నాకు చిన్నతనం నుంచి ఎన్టీఆర్ అంటే అభిమానం అని, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం సలహా మేరకే హైదరాబాద్ లో క్యాన్సర్ ఆసుపత్రికి బీజం పడింది. ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబాలతో గత ఐదు దశాబ్దాలుగా సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నాను. ఈ విషయాన్ని అనేకసార్లు చంద్రబాబు గుర్తు చేస్తుండేవారు. గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఆహార అలవాట్లను మార్చుకోవడం ద్వారా ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను నివారించవచ్చని, ప్రజలకు అవగాహన కల్పిస్తే ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను నివారించవచ్చని తెలిపారు.
ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో జయరాం కోమటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నీ రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్యను అందించడానికి మనమంతా కృషి చేసి జన్మభూమి రుణం తీర్చుకుందామని పిలుపునిచ్చారు. ఇప్పుడు వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ లాంటి అంతర్జాతీయ సంస్థలు వచ్చాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అనంతరం కోమటి జయరాంను, నోరి దత్తాత్రేయను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, శ్రీధర్ అప్పసాని, శ్రీహరి మందాడి, సాయి బొల్లినేని, భాను మాగులూరి కూడా మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి రాధాకృష్ణ మూల్పురి, రంజిత్ కోమటి, మురళి పమిడిముక్కల, ఫణి కంతేటి, శ్రీధర్ సాదినేని, నందగిరీష్ మూల్పూరి, నాగరాజు చింతం, సురేష్ యలమంచిలి, గోపి వాగ్వాల, హరి దుంగతావుల, విశ్వనాథ్ కోగంటి, లావా ఐనంపూడి, గౌరి కొర్రోతు, మధు ముప్పాల, శ్రీధర్ వీర్మచినేని తదితరులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి








