శ్రీరాముడిగా సూపర్‌స్టార్ మహేష్?
ఇక్కడి పోస్టర్ చూసి నిజంగానే సూపర్‌స్టార్ మహేష్ శ్రీరాముడిగా నటిస్తున్నాడని అనుకోకండి. అది కేవలం ఫ్యాన్ మేడ్ పోస్టర్. ఆమధ్య మహేష్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టు రాజమౌళి ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. టాప్ హీరోలకు సంబంధించిన ఒ సినిమా ఎనౌన్స్ అయ్యిందంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. పండగ చేసుకుంటారు. కొంతమంది అభిమానులు తమ హీరో సినిమా టైటిల్ ఇదీ అని ఊహించుకొని టైటిల్‌తో సహా పోస్టర్, ఆ హీరో గెటప్‌ని కూడా డిజైన్ చేసేస్తారు.
అలాంటి ఓ అభిమాని రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న `రామాయణం` అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్టర్లో శ్రీరాముడిగా మహేష్ ఎలా ఉంటాడో ఊహించుకొని అతని ఫోటోతో శ్రీరాముడి గెటప్‌ని డిజైన్ చేశాడు. పోస్టర్లో `రామాయణం` అనే టైటిల్, దాని కింద ఎస్.ఎస్.రాజమౌళి పేరు కనిపిస్తుంది. పోస్టర్ అడుగున సూపర్‌స్టార్ మహేష్ యాజ్ లార్డ్ రామా ఉంటుంది.
మహేష్, రాజమౌళి కాంబినేషన్లో చేయబోయే సినిమా ఏ జోనర్లో ఉంటుందో తెలీదు. అసలు ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ అవ్వలేదు. మరి ఇప్పుడే ఆ సినిమా గురించి ఎలా ఊహించగలం. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` చిత్రం షూటింగ్ ఇంకా 30 శాతం బ్యాలెన్స్ ఉంది. అది పూర్తయితే గానీ రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కాన్సెప్ట్ బయట పెట్టడు.













