భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న కాజల్…
కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో ఒక ఊపు ఊపిన హీరోయిన్. తన అందచందాలతో కుర్రకారు మనసుని కొల్లగొట్టిన బ్యూటీ. దాదాపు తెలుగులో అందరి స్టార్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెరంగ్రేటం చేసిన కాజల్ తర్వాత తన కెరీర్ లో సూపర్ హిట్ మూవీస్ తో దూసుకుపోయింది. ఇటు సీనియర్ హీరోలు, అటు అప్ కమింగ్ హీరోలు అనే తేడా లేకుండా ప్రతి హీరోతో జత కట్టి కనువిందు చేసింది ఈ పంజాబీ బ్యూటీ. వ్యాపారవేత్త అయినటువంటి గౌతమ్ కిచులుని వివాహం చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.
పెళ్లి తర్వాత సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు రీసెంట్ గా బేబీ కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. బిడ్డ పుట్టాక మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది కాజల్. తాజాగా స్టార్ హీరో కమల్ హాసన్ సరసన హీరోయిన్ గా ఈ అమ్మడు జతకడుతుండడం విశేషం. తల్లి అయ్యాక కూడా అందం విషయంలో ఎక్కడా తగ్గేదే లేదంటూ ఆడియన్స్ ని ఆశ్చర్యపరుస్తుంది ఈ అమ్మడు. రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ NBK108 సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్ లో బాలయ్య కి జోడిగా కాజు పాపని అప్ప్రోచ్ అయినట్టు సమాచారం. అయితే ఈ సినిమాకి కాజల్ అగర్వాల్ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు 3 కోట్ల పారితోషికాన్ని ఈ ముద్దుగుమ్మ డిమాండ్ చేయడంతో మేకర్స్ షాకయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీని బట్టి కాజల్ క్రేజ్ ఇప్పటికి ఏమాత్రం తగ్గలేదని అర్ధమవుతుంది. బాలయ్య పక్కన అందాలు ఆరబోయడానికి ఈ బ్యూటీ అడిగిన రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయ్యారట. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ ని తెరపై చూడడానికి NBK ఫాన్స్ , కాజల్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.













