“దేవిశ్రీప్రసాద్” టీజర్ విడుదల
ఆర్.ఒ.క్రియేషన్స్ బ్యానర్‌పై మనోజ్ నందన్, భూపాల్, పూజా రామచంద్రన్ ప్రధాన తారాగణంగా సశేషం, భూ వంటి చిత్రాల డైరెక్టర్ శ్రీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతోన్న థ్రిల్లర్ ఎంటర్టైనర్ దేవిశ్రీప్రసాద్. ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ ధనరాజ్ కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.






