మెగా158 లాంచ్ కు భారీ ఏర్పాట్లు
టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ మళ్లీ సెట్స్‌పైకి రానుంది. మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు బాబీ కొల్లి రెండోసారి చేతులు కలుపుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య(waltair veerayya)బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే జోష్‌తో మెగా158 పేరుతో కొత్త ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్(Kvn productions) తెలుగు చిత్రసీమలో తమ తొలి ప్రొడక్షన్‌గా భారీ స్థాయిలో నిర్మించేందుకు సిద్ధమవుతోంది. మొదట ఈ సినిమా ప్రారంభోత్సవం వాయిదా పడటంతో, ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక సమస్యల కారణంగా ప్రాజెక్ట్ మారుతుందన్న రూమర్లు గట్టిగా వినిపించాయి.
అయితే ఈ వార్తలన్నింటినీ చిత్ర యూనిట్ పూర్తిగా ఖండించింది. మెగా158(Mega158) ప్రాజెక్ట్‌పై కేవీఎన్ ప్రొడక్షన్స్(KVN Productions)కు ఎలాంటి సందేహాలు లేవని, ఈ సినిమాను తామే నిర్మిస్తామని స్పష్టం చేసింది. దీంతో చిరంజీవి ఇతర నిర్మాతలను సంప్రదించారన్న ప్రచారం కూడా నిజం కాదని తెలిపింది. ఈ సినిమా కోసం ఘనమైన ప్రారంభోత్సవాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ఈ ఈవెంట్‌ను ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇక సినిమా విషయానికి వస్తే, ప్రముఖ నటి ప్రియమణి(priyamani) హీరోయిన్గా నటించనుండగా, సంగీత దర్శకుడు తమన్(thaman) సంగీతం అందించనున్నారు. దర్శకుడు బాబీ కొల్లి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఇవి కూడా చదవండి








