టీసీఎస్ బాస్ జీతం ఎంతో తెలుసా? సామాన్య ఉద్యోగితో పోలిస్తే ఏకంగా 332 రెట్లు ఎక్కువ!
భారతదేశపు అగ్రశ్రేణి ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన అగ్ర నాయకత్వానికి చెల్లించే వేతనాలు (TCS Salary) ఎప్పుడూ చర్చనీయాంశమే. ఐటీ రంగంలో ప్రాజెక్టుల కొరత అంటూ సాధారణ ఉద్యోగులకు సింగిల్ డిజిట్ హైక్స్‌తో సరిపెడుతున్న కంపెనీలు.. తమ సీఈఓల పారితోషికాల విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా టీసీఎస్ విడుదల చేసిన 2025-26 ఆర్థిక సంవత్సరపు వార్షిక నివేదిక ఈ వేతనాల వ్యత్యాసాన్ని మరోసారి బట్టబయలు చేసింది. టీసీఎస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ కె. కృతివాసన్ తీసుకుంటున్న కళ్లు చెదిరే ప్యాకేజీ ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రూ. 28.1 కోట్ల భారీ పారితోషికం:
టీసీఎస్ బాధ్యతలు (TCS Salary) స్వీకరించిన తర్వాత కృతివాసన్ సంస్థను విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను ఆయన మొత్తం రూ. 28.1 కోట్ల భారీ పారితోషికాన్ని అందుకున్నారు. అంతకుముందు ఏడాదితో (రూ. 26.5 కోట్లు) పోలిస్తే ఆయన ప్యాకేజీలో 6 శాతం మేర పెరుగుదల నమోదైంది.
జీతం తక్కువే.. కానీ కమీషనే కోట్లల్లో!
ఈ భారీ ప్యాకేజీని విశ్లేషిస్తే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడుతుంది. ఆయనకు కంపెనీ ఇచ్చే ఫిక్స్డ్ శాలరీ (TCS Salary) చాలా తక్కువే అనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి
మూల వేతనం (Basic Salary): రూ. 1.67 కోట్లు
అలవెన్సులు, ఇతర సదుపాయాలు: రూ. 1.43 కోట్లు
కమీషన్ (Commission): ఏకంగా రూ. 25 కోట్లు
కంపెనీ లాభాలు, వార్షిక ఆర్థిక పనితీరు ఆధారంగా బోర్డు నిర్ణయించే ఈ ‘కమీషన్’ రూపంలోనే ఆయన అత్యధిక ఆదాయాన్ని (రూ. 25 కోట్లు) తన ఖాతాలో (TCS Salary) వేసుకోవడం గమనార్హం. ఆయనతో పాటే సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ఆర్తి సుబ్రమణియన్ కూడా ఏమాత్రం తగ్గకుండా రూ. 18.3 కోట్ల భారీ వేతనాన్ని అందుకుంటున్నారు.
సామాన్యుడికి, సీఈఓకి భారీ అంతరం
సంస్థలోని ఒక సగటు ఉద్యోగి సంపాదించే జీతంతో (TCS Salary) పోలిస్తే, సీఈఓ కృతివాసన్ ప్యాకేజీ అక్షరాలా 332.8 రెట్లు ఎక్కువ కావడం విశేషం. అంటే ఒక సాధారణ ఐటీ ఉద్యోగి జీవితకాలం కష్టపడినా, సీఈఓ కేవలం ఒక ఏడాదిలో సంపాదించిన దాంట్లో కనీసం సగం కూడా సంపాదించలేడని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
ఉద్యోగుల హైక్స్ పరిస్థితి ఏంటి?
సీఈఓలు కోట్ల రూపాయల కమీషన్లు తీసుకుంటున్న వేళ, రాత్రింబవళ్లు కోడింగ్ చేస్తూ కష్టపడే జూనియర్, మిడ్-లెవల్ ఉద్యోగుల ఇంక్రిమెంట్ల పరిస్థితి (TCS Salary) మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. సాధారణ ఉద్యోగులకు సగటున 4.5 నుంచి 7 శాతం వరకు మాత్రమే పే హైక్స్ దక్కాయి. అయితే ఎక్స్ట్రార్డినరీ పనితీరు కనబరిచిన కొద్దిమందికి మాత్రం డబుల్ డిజిట్ (10 శాతానికి పైగా) ఇంక్రిమెంట్లు లభించాయి. విదేశాల్లో పనిచేసే (ఆన్సైట్) ఉద్యోగులకు కేవలం 1 నుంచి 6 శాతం మధ్య వేతన పెంపును మాత్రమే సంస్థ అందించింది. ప్రమోషన్లు, ఇతర సర్దుబాట్లు అన్నీ కలిపి చూసుకున్నా సంస్థ మొత్తం సగటు పే హైక్ కేవలం 5 నుంచి 8 శాతం మధ్యలోనే ఉందని టీసీఎస్ అధికారిక నివేదిక తేల్చిచెప్పింది.
ఇవి కూడా చదవండి







