Coimbatore: కోయంబత్తూర్ వెళ్దామా!
కోయంబత్తూర్ అనేది తమిళనాడులో చెన్నై తర్వాత డెవలప్ అయిన ప్రధాన నగరం. అలాంటి సిటీ ట్రిప్ కి వెళ్లడానికి మీరు ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ విశేషాలు మీకోసమే..
అంత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో పేరుగాంచిన ప్రాంతం.. కోయంబత్తూర్. ఇక్కడి ప్రత్యేక వాతావరణం, చారిత్రక వైభవం, సంస్కృతి ఈ మూడింటి కలయిక వల్ల కోయంబత్తూర్ ప్రత్యేకత కలిగి ఉంది. తమిళనాడులో చెన్నై తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్రధాన నగరంగా కోయంబత్తూర్ బాగా గుర్తింపు పొందింది. దక్షిణ భారతదేశ మాంచెస్టర్గా పేరుగాంచిన ఈ సిటీ.. పరిశ్రమలతో పాటు పర్యాటక ప్రాంతంగానూ అలరారుతోంది.
ఏడాది పొడవునా తక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం, స్వచ్ఛమైన గాలి, పచ్చని పరిసరాలతో Western Ghats, Palakkad Gap నుంచి వీచే చల్లని గాలుల మూలాన ఒక ప్రత్యేక వాతావరణం ఏర్పడి.. పర్యాటకులను ఆసాంతం ఆకర్షిస్తాయి. ఇక్కడి నేల వ్యవసాయాభివృద్ధికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. పత్తి సాగు విస్తృతంగా పెరగడంతో వస్త్ర పరిశ్రమకు నాంది అయింది. 1888లో ప్రారంభమైన తొలి వస్త్ర మిల్లు మొదలు తరువాత అనేక పరిశ్రమలు నెలకొనేలా మార్గదర్శకమైంది.

చారిత్రక నేపథ్యం.. Noyyal River తీరాన 2వ లేదా 3వ శతాబ్దానికి ముందే ప్రారంభ చోళులలో మొదటివాడైన కరికాలన్ కాలం నుంచే ఈ ప్రాంతం ఉనికిలో ఉంది. దీని గొప్ప పాలకులలో రాష్ట్రకూటులు, చాళుక్యులు, పాండ్యులు, హొయసలులు, విజయనగర రాజులున్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు కొంగునాడు బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళినప్పుడు, దాని పేరు కోయంబత్తూర్‌గా మారింది. స్థానిక తమిళ భాషలో.. కోయంబత్తూర్‌ను ‘కోవై’ అని పిలుస్తారు.
కపుల్స్ కి బెస్ట్ ఆప్షన్ ఊటీ..
దక్షిణ భారతదేశంలోని మాంచెస్టర్ గా పిలువబడే కోయంబత్తూర్.. అత్యంత పారిశ్రామికీకరణ చెందిన జిల్లాల్లో ఒకటి కాగా తమిళనాడులోని ప్రధాన వస్త్ర, పారిశ్రామిక, వాణిజ్య, విద్య, సమాచార సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, తయారీ కేంద్రంగా కూడా ఉంది. తమిళనాడులోనే కాక భారతదేశంలో ప్రముఖ హిల్ స్టేషన్లలో ఊటి అగ్రస్థానంలో ఉందనడంలో అతిశయోక్తి లేదు. హిల్ స్టేషన్స్ లలో మేటిగా నిలిచిన ఊటికి.. దగ్గర్లో బొటానికల్ గార్డెన్ నుంచి పైకరా, హిడన్ వ్యాలీ, వ్యాక్స్ మ్యూజియం వంటి ఎన్నో ప్రాంతాలను మీరు చూడొచ్చు.
ఇవి కూడా చదవండి
ఎలా వెళ్లొచ్చు..
రైలులో ప్రయాణం చేస్తే 24 గంటల కంటే ఎక్కువ టైం పడుతుంది. కోయంబత్తూర్ చేరుకున్న తర్వాత అక్కడ స్టే చేయడానికి రైల్వే స్టేషన్ ఏరియా, గాంధీపురం ఏరియా బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఏరియాల నుంచి కోయంబత్తూర్ తిరగడానికి ఈజీగా ఉంటుంది.
ఇక తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లాలనుకునేవారు సికింద్రాబాద్, వైజాగ్, విజయనగరం నుంచి వెళ్లొచ్చు లేదా తిరుపతి నుంచి కూడా వెళ్లొచ్చు అలానే విమానం, సొంత వాహనాల ద్వారా కూడా వెళ్లొచ్చు. ప్రకృతి ఒడిలో కాసేపు ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఇది మంచి డెస్టినేషన్.
ఇంకా ఏమేం చూడొచ్చు.. కోయంబత్తూర్ లో చూడాల్సిన పాపులర్ ప్లేసెస్ ఇవే..
ఆధ్యాత్మికతకు ప్రతీక అయిన ఆదియోగి శివుడి విగ్రహం, కొండపై వెలసిన ప్రసిద్ధ ఆలయం Marudhamalai Temple, శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలిచే Perur Pateeswarar Temple, శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి నిదర్శనమైన GD Naidu Museum, Kovai Kutralam Falls, Velliangiri Hills, Black Thunder, Monkey Falls లాంటి మరెన్నో.. లోకల్ షాపింగ్, ఫుడ్ ను ఎంజాయ్ చేయవచ్చు. లోకల్ బస్సులు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి లేదా విడిగా ఆటోలో కూడా ఈ ప్రదేశాలను మీరు కవర్ చేయవచ్చు. ఈ టూర్‌కు దాదాపు 5 నుంచి 6 రోజులు టైం స్పెండ్ చేయొచ్చు.
తెలుగు రాష్ట్రాల నుంచి రైలు, విమానం, సొంత వాహనాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
ప్రధాన రైళ్లు: Sabari Express, Kerala Express, Tata Alappuzha Express.
టూర్ బడ్జెట్ ఎంతంటే… మీరు ఎంచుకునే రవాణా బట్టి మీ ప్రయాణం ఖర్చు ఉంటుంది. వసతి: రోజుకు రూ.750 నుంచి రూ.1200, భోజనం: రోజుకు రూ.300 నుంచి రూ.500, లోకల్ ట్రావెలింగ్: రోజుకు సుమారు రూ.500, ప్రవేశ రుసుములు: సుమారు రూ.600, ఇతర ఖర్చులు: సుమారు రూ.1500 అవుతుంది.
ఇవి కూడా చదవండి
https://www.tamilnadutourism.tn.gov.in/index.php/
https://www.tamilnadutourism.tn.gov.in/index.php/contact
















