Indians: 2025లో భారతీయులు ఎక్కువగా వెళ్లిన టాప్ 3 దేశాలివే..
2025లో దాదాపు 3.3 కోట్ల మంది భారతీయులు విదేశీ పర్యటనలకు వెళ్లారని తాజాగా గణాంకాలు చెబుతున్నాయి. అందులో టాప్ 3 దేశాలైన యూఏఈ, సౌదీ, థాయిలాండ్ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం:
ఇటీవల కాలంలో సెలవులు దొరికితే భారతీయులు విదేశీ ప్రయాణాలపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారట. పెరుగుతున్న వేతన ఆదాయాలు, మెరుగైన ఏరో కనెక్టివిటీ, అంతర్జాతీయ సెలవులపై ఆసక్తి ఉండటం వల్ల ఎక్కువ శాతం మంది ఇండియన్స్ విదేశాలకు టూర్ ప్లాన్ చేసేందుకు ఇష్టపడుతున్నారు.
తాజాగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఈ విషయమై, విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025లో ఏయే దేశాలకు భారతీయులు ఎక్కువగా టూర్లు వెళ్లారనే విషయం బయటపడింది. ఈ జాబితాలో యూఏఈ మొదటి స్థానంలో ఉండగా, గతేడాదిలోనే 3.27 కోట్ల మంది భారతీయులు విదేశాలకు ప్రయాణించినట్లు తేలింది. 2024లో ఈ సంఖ్య 3.08 కోట్లు ఉండగా, ఈ ఏడాదిలో ఇంకాస్త పెరుగుదల నమోదైంది.
విదేశీ ప్రయాణం అనగానే ఇప్పుడు అనేక కుటుంబాలు, ఉద్యోగ వర్గాలకు అత్యంత ప్రాధాన్యతగా మారిందని తెలుస్తుంది.
ఈజీ ట్రావెల్ చేయగలిగే UAE అగ్రస్థానంలో ఉండగా, తీర్థయాత్రలకు సౌదీ అరేబియా తర్వాతి స్థానాల్లో బీచ్‌లు, వైబ్‌లకు నెలవైన థాయిలాండ్ నిలిచాయి.
ఇవి కూడా చదవండి
మొదటి స్థానంలో యూఏఈ..
2025లో భారతీయుల మొత్తం విదేశీ ప్రయాణాల్లో 26.3% వాటాతో యూఏఈ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ప్రాంతం భారత్‌కు అత్యంత సమీపంలో ఉండడం, తక్కువ ఖర్చు, సులభంగా ట్రావెల్ చేయగలగడం, దుబాయ్, అబుధాబి లాంటి నగరాలకు ఎప్పటికప్పుడు విమాన సర్వీసులు అందుబాటులో ఉండటం, షాపింగ్ ఫెస్టివల్స్, మోడ్రన్ ఎంటర్టైన్మెంట్ సెంటర్లు, థీమ్ పార్కులు, లగ్జరీ ఫెసిలిటీస్ వంటివి ఉండటం వల్ల చాలామంది భారతీయులు తమ మొదటి టూర్ లిస్ట్ లో యూఏఈని ఎంచుకుంటున్నట్లు తేలింది.
రెండో స్థానం.. సౌదీ అరేబియా:
2025లో మొత్తం విదేశీ ప్రయాణాల్లో 10.3% వాటాతో ఈ దేశం సెకండ్ ప్లేస్ లో నిలిచింది. సౌదీలో ఉమ్రా, ఇతర యాత్రల కోసం ప్రధాన కేంద్రం ఉండడం, పెద్ద సంఖ్యలో భారతీయులు నివాసం ఉండేందుకు అనుకూలంగా ఉండటంతో పాటు కుటుంబ, ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు, భారత్‌తో ఉన్న సాంస్కృతిక, చారిత్రక సంబంధాల వల్ల భారతీయులు సౌదీకి వెళ్తున్నారట.
మూడో స్థానం.. థాయ్ లాండ్:
2025లో 6.8% భారతీయ ప్రయాణికులతో థాయ్ లాండ్ మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడికి వెళ్లేందుకు తక్కువ ఖర్చు, పైగా సెలవులకు అనువైన ప్రదేశం కావడం, పాపులర్ బీచ్‌లు, స్ట్రీట్ మార్కెట్లు, జాయ్ ఫుల్ నైట్ లైఫ్, తక్కువ టైంలో విమాన ప్రయాణం చేయగలగడం, తక్కువ చార్జిలు, రకరకాల డిషెస్, డ్రింక్స్, షాపింగ్ లాంటి కారణాల వల్ల భారతీయులు థాయ్‌లాండ్‌కు కూడా ఎక్కువగా వెళ్తున్నారు.
ఇక ఇవే కాకుండా 2025లో భారతీయులు ఎక్కువగా వెళ్లిన విదేశాల్లో వరుసగా సింగపూర్, యూఎస్ఏ, యూకే, మలేషియా, ఖతార్, కువైట్, ఒమాన్, కెనడా, ఆస్ట్రేలియా, వియత్నాం, శ్రీలంక, జర్మనీ, బహ్రెయిన్, జపాన్, ఫ్రాన్స్, రష్యాలు కూడా నిలిచాయి.
ఇవి కూడా చదవండి
















