మంత్రి కేటీఆర్‌కు అరుదైన ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి మంత్రి కేటీఆర్‌కు అరుదైన ఆహ్వానం అందింది. రెండు అంతర్జాతీయ సదస్సులకు హాజరుకావాలని మంత్రి కేటీఆర్ ఆహ్వానం అందింది. కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలో జరిగే ప్రపంచ పర్యావరణ, నీటి సదస్సుకు రావాలని కేటీఆర్‌ని అమెరికా ఇంజనీర్ల సంఘం ఆహ్వానించింది. ప్రపంచ పర్యావరణ, నీటి సదస్సులో మిషన్ భగీరథపై మాట్లాడాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను అమెరికా ఇంజినీర్ల సంఘం కోరింది. మే 21 నుంచి 25 వరకు ఈ సదస్సు జరగనుంది. వాటర్ కాంగ్రెస్‌లో ప్రారంభోపన్యాసం చేసే తొలి విదేశీ వ్యక్తి మంత్రి కేటీఆర్ కానున్నారు. అదేవిధంగా మే 18,19వ తేదీల్లో జరగనున్న వార్షిక సదస్సులో ప్రసంగించాలని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాయలం కేటీఆర్‌ను ఆహ్వానించింది. రెండు అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనాల్సిందిగా తనకు ఆహ్వానం రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు గుర్తింపుగా అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానాలు అందినట్లు కేటీఆర్ తెలిపారు.






