మోత్కుపల్లికి లైన్ క్లియర్ ?
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అగ్రనేత, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి దాదాపు ఖాయమైనట్టు హస్తినలో ప్రచారం జరగుతోంది. ఎన్డిఎ భాగస్వామ్య పక్షాల సమావేశానికి హైదరాబాద్ నుంచి తనతో పాటు నర్సింహులును ఢిల్లీకి తీసుకువెళ్ళిన చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పరిచయం చేశారు. గతంలో నర్సింహులుకు గవర్నర్ పదవి కట్టబెట్టాలని చంద్రబాబు ప్రధాని నరేంద్రమోడీతో పాటు అమిత్ షాను కోరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసినట్టు సమాచారం. గవర్నర్ పదవికి అన్ని విధాలా అర్హుడవని త్వరలో గవర్నర్ల నియామకాలను చేపట్టనున్నామని అందులో ఖచ్చితంగా అవకాశం కల్పించనున్నట్లు అమిత్ షా తనను కలిసి మోత్కపల్లికి భరోసా ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల కథనం. ఆ తర్వాత మోత్కుపల్లి కొందరు బీజేపీ అగ్రనేతలతో కూడా సమావేశమయ్యారని వారు కూడా గవర్నర్ పదవి విషయంలో సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.













