అసెంబ్లీ ప్రత్యేక భేటీ
తెలంగాణ అసెంబ్లీ భవనంలో బీఏసీ (శాసనసభా వ్వవహారాల సంఘం) సమావేశం ముగిసింది. రేపు (ఆదివారం) ఒక్కరోజే అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. సభలో రిజర్వేషన్లు, జీఎస్టీ, హెరిటేజ్ బిల్లులపై చర్చించాలని నిర్ణయించారు. బీఏసీ సమావేశం స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్కు, చిన్నారెడ్డి, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య, ఎంఐఎం నుంచి ఖాద్రీపాషా హాజరయ్యారు.













