మహారాష్ట్ర ప్రభుత్వంలో చర్చలు జరుపుతున్నాం : మంత్రి జూపల్లి
ప్రాణహిత ప్రాజెక్ట్ (Pranahita Project) నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వెంకట స్వామి (Vivek Venkat Swamy), ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించారు. నీటి లభ్యతపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. నాటు పడవలపై నదీ ప్రవాహాన్ని మంత్రులు పరిశీలించారు. అనంతరం జూపల్లి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ లోని మూడు జిల్లాలకు సాగు నీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వం (Government of Maharashtra)తో చర్చలు జరుపుతామని అన్నారు. ముంపుకు గురయ్యే ప్రాంతాలకు నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పారు. తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ పెద్దమనసుతో ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుమతులివ్వాలని కోరారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రాణహిత ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి








