Jupally Krishna Rao: పాలమూరుపై రాజకీయాలు చేస్తోంది మీరా? మేమా? : మంత్రి జూపల్లి
గత ప్రభుత్వ నాయకులకు సరైన ఆలోచన, అవగాహన లేక రాష్ట్రానికి తీవ్ర నష్టం చేశారని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నీళ్లు లేని చోట మాత్రం పదేళ్లలో అనేక ప్రాజెక్టులు (Projects) కట్టారని విమర్శించారు.బిఆర్ఎస్ (BRS) పార్టీకి ధనిక రాష్ట్రం అప్పగిస్తే, రూ.8 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు కాలువలకు ఇంకా అనుమతే రాలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టుపై రాజకీయాలు చేస్తోంది మీరా?మేమా ? అని నిలదీశారు. పాలమూరు ప్రాజెక్టు (Palamuru Project) ను 80 శాతం పూర్తి చేశామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.








