తెలంగాణకు వచ్చిన ప్రధాని సతీమణి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సతీమణి జశోదా బెన్ వికారాబాద్లో పర్యటించారు. స్థానికంగా ఉన్న నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రతినిత్యం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. అనంతరం పట్టణంలోని సంతోషిమాత దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గురువారం రాత్రి వికారబాద్ పట్టణానికి చేరుకున్న ఆమె ఎలాంటి ఆడంబరాలకు తావివ్వకుండా నాగదేవత ఆలయ ప్రధాన అర్చకుడు బరాడి రమేశ్ ఇంట్లో బస చేశారు. ఈ రోజు ఆమె ఇక్కడే ఉండి రేపు మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుగుపయనం కానున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, స్థానికులు ఆమెను చూసేందుకు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.













