అభివృద్ధి జరగాలంటే తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి: రాంచందర్ రావు
రాహుల్ గాంధీ చేపట్టింది భారత్ జోడో యాత్ర కాదని, రాజకీయంగా దేశాన్ని విభజించే యాత్ర అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు (N. Ramchander Rao) విమర్శించారు. వచ్చే నెల 10వ తేదీన ప్రధాని మోదీ (Modi) తెలంగాణ పర్యటనకు రానున్న సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించతలపెట్టిన సభ పోస్టర్ ను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంచందర్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ (Congress) చర్యలు దేశాన్ని విభజించేలా ఉన్నాయని, ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని ప్రతిబింబించేలా మోదీ సభకు జన ఆగ్రహ సభ గా నామకరణం చేశామని వెల్లడించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లు, వివిధ అంశాలపై బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలతో విస్తృతంగా చర్చించామని తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) లో రూ.8వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ (Parade Grounds) లో జరిగే జన ఆగ్రహ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మొదటి సారి రాష్ట్రానికి విచ్చేయడం ఆనందంగా ఉందన్నారు. సభకు మేధావులు, యువత, మహిళలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి








