భవిష్యత్తులో తెలంగాణలోనూ తమ పార్టీనే అధికారంలోకి : రామచందర్ రావు
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అగ్రనేతలు సన్నాహక సమావేశం నిర్వహించారు. బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణ అంశాలపై చర్చించారు. సైబరాబాద్ (Cyberabad), హైదరాబాద్ (Hyderabad), మల్కాజిగిరి (Malkajgiri) కార్పొరేషన్ల పరిధిలోని 300 డివిజన్ల నుంచి జనసమీకరణ అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachander Rao) మాట్లాడుతూ మోదీ మÖడోసారి ప్రధాని అయ్యాక మొదటిసారి హైదరాబాద్కు వస్తున్నారని తెలిపారు. మోదీ రాకతో రాజీకయ మార్పు మొదలవుతుందన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీలో అధికారంలోకి రాబోతుందని, భవిష్యత్తులో తెలంగాణలోనూ తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, మల్కా కొమురయ్య , పార్టీ సంస్థాగత ఇన్ఛార్జి చంద్రశేఖర్ తివారి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి








