సమస్యకు సమ్మె పరిష్కారం కాదు : మంత్రి పొన్నం
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ (RTC) పరిరక్షణ, ప్రజాశ్రేయస్సు కోసం సమ్మె విరమించాలని కోరారు. సమస్యకు సమ్మె పరిష్కారం కాదన్నారు. కార్మికుల సమస్య పరిష్కారానికి కమిటీ వేసినట్లు తెలిపారు. నాలుగు వారాల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించామన్నారు. 32 అంశాల్లో 29 వెంటనే పరిష్కారం చేయదగినవని అన్నారు. ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల అంశాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఈ విషయాలపై సీఎం (Chief Minister), డిప్యూటీ సీఎం ( Deputy Chief Minister) దగ్గర చర్చిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి








