తెనాలి యువకుడికి తెలంగాణ సర్కారు అవకాశం!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠించనున్న 125 అడుగుల భారీ అంబేడ్కర్ కాంస్య విగ్రహ రూపకల్పనకు తెనాలి శిల్పిని ఆహ్వానించారు. ఈ మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పైబర్ గ్లాస్ నమూనా విగ్రహాన్ని పంపినట్లు శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. దేశంలో శిల్పకళలో స్నాతకోత్తర పట్టా (పీజీ) పొందిన పది మంది శిల్ప కళాకారులను ఎంపికచేసిన తెలంగాణ అంబేడ్కర్ విగ్రహ కమిటీ మీటరు ఎత్తులో ఫైబర్ గ్లాస్ నమూనా విగ్రహాన్ని తయారుచేయాలని కోరిందని, ఇందుకోసం తమకు రూ.1.25 లక్షల అందజేసిందని వారు తెలిపారు. పదిమందిలో ఏడుగురు ప్రొ||ప్రదీప్ చక్రవర్తితో పాటు తెనాలికి చెందిన యువ శిల్పి కాటూరి రవిచంద్రను ఎంపిక చేశారు. ప్రముఖుల సరసన తనకు అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి రవిచంద్ర ధన్యవాదాలు తెలిపారు.













