కవితను కలిసిన ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల
ప్రపంచవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు జోరుగా సాగుతుండటంపై ఎన్నారై విభాగం సలహాదారు కవిత అభినందనలు తెలిపారు. పెద్దసంఖ్యలో పార్టీలో చేరేందుకు కృషి చేస్తున్నారని ఎన్నారై విభాగాలను ప్రశంసించారు. ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల టీఆర్ఎస్ ఎన్నారై విభాగం సలహాదారు కవితను తెలంగాణ భవన్లో కలిశారు. సభ్యత్వ నమోదు విషయంలో ఎన్నారై శాఖలు చేస్తున్న కృషిని వివరించారు. ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. న్యూజిలాండ్, కతార్, కువైట్, ఆస్ట్రియా, నార్వే, ఫ్రాన్స్, స్వీడన్, జర్మనీ, బహ్రేయిన్, ఇటలీ, లాత్వియా తదితర దేశాల్లో ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోనేనివారందరి జాబితాలను తెలంగాణ భవన్లో ఆన్లైన్ చేసి, వారందరికీ సభ్యత్వం ఇస్తున్నట్లు కవిత తెలిపారు.













