సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం .. హాజరైన ప్రముఖులు
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో పెద్ద ఎత్తున యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా ప్రజలు విద్యార్థులు, స్వచ్ఛంధ సంస్థల నిర్వాహకులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy,), మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu), ఎంపీలు ఈటల రాజేందర్, లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, సినీ నటులు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty), డింపుల్ హయాతి(Dimple Hayathi) తదితరులు పాల్గొని యోగా సాధన చేశారు. ఏటా మాదిరిగానే యోగా కార్యక్రమం నిర్వహించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నిత్యం యోగా చేయడం వల్ల రుగ్మతల బారిన పడకుండా ఉండొచ్చని తెలిపారు.








