హైదరాబాద్ వైద్యుడి ఘనత .. ఉత్తర అమెరికాలోని
హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ రాజశేఖర్ (Dr. Rajasekhar) పర్వతారోహణలో సత్తా చాటుతున్నారు. తాజాగా ఉత్తర అమెరికా (North America)లోని ఎత్తైన డెనాలి శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. దీంతో ప్రతి ఖండంలోని ఎత్తైన శిఖరాన్ని అధిరోహించే సెవెన్ సమిట్స్ (Seven Summit) ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి వైద్యుడి (Doctors)గానూ నిలిచారు.








