టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి నామినేషన్లు
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 14 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ నెల 18 నామినేషన్ల గడువు ముగియనుంది. 19న నామినేషన్ల పరిశీలన, 20న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. కొంపల్లిలో ఈ నెల 21న జరిగే ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరుగనున్నది. నామినేషన్ల స్వీకరణ రేపు ఉదయంయ 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనున్నది. పార్టీలో క్రియాశీలక సభ్యులే అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సృష్టం చేశారు.













