రేపు భద్రాద్రికి సీఎం కేసీఆర్
భద్రాచలం రామక్షేత్రం కల్యాణశోభను సంతరించుకుంది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రగిరిలో బుధవారం శ్రీసీతారాముల కల్యాణం, గురువారం శ్రీరామపట్టాభిషేకం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగనున్నది. ఈ వేడుకలను నిర్వహించేందుకు మిథిలా ప్రాంగణం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. సీతారాముల కల్యాణ వేడుకలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనున్నారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హాజరై పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. శ్రీరామ పట్టాభిషేకానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరుకానున్నారు.













