షికాగోలో షబ్బీర్ అలీకి సన్మానం
ముస్లింలు రాజకీయ రిజర్వేషన్లు సాధించేందుకు రాజీలేని పోరు సలుపుతానని శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ హామి ఇచ్చారు. ముస్లింల విద్య, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధి, సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలకు గాను యుఎస్ఎలోని షికాగోలో ముస్లింలు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగాను ఆయన మాట్లాడుతూ గతంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ సాధించేందుకు నాటి ప్రభుత్వంతో ఏ విధంగా కృషి చేశారో వివరించారు. ఆ 4 శాతం రిజర్వేషన్ అమలు తర్వాత 1,20,000 బాల, బాలికలు వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పొందగలిగారన్నారు. తెలంగాణ కోసం మధ్య ప్రాచ్య దేశాల్లో ముస్లింలు ఏ విధంగా పోరాడారో ఆయన వివరించారు.













