అరకు అందాలకు అద్దాల శోభ
దేశంలో ప్రప్రథమంగా ప్రవేశపెట్టిన విస్టా డోమ్ (అద్దాల కోచ్) రైలు కోచ్‌ను విశాఖలో ప్రారంభించారు. భువనేశ్వర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైల్వే మంత్రి సురేష్ ప్రభు, విశాఖ ఎంపీ హరిబాబు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. విశాఖ రైల్వే స్టేషన్ లోని 8వ నంబర్ ప్లాట్‌ఫారమ్ నుంచి అరకు ఎంపీ కొత్తపల్లి గీత, స్థానిక ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులు జెండా ఊపి కోచ్‌ను ప్రారంభించారు. మైకనైజ్డ్ లాండ్రీ సిస్టమ్‌ను కూడా ప్రారంభించారు. ఈ రైలు బోగీ సేవలు ఈ నెల 19నుంచి అందుబాటులోకి వస్తాయని రైల్వే వర్గాలు తెలిపాయి.













