బ్రహ్మూెత్సవాలకు ముస్తాబైన ఒంటిమిట్ట
కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి బ్రహ్మూెత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేడు వ్యాసాభిషేకం, అంకుర్పారణతో బ్రహ్మూెత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. రేపు ధ్వజారోహణం, నవమి వేడుకలు, పోతన జయంతి నిర్వహిస్తారు. రాత్రి స్వామివారికి శేషవాహన సేవ నిర్వహిస్తారు. ఉత్సవాల నేపధ్యంలో ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. స్వామి వారి కల్యాణం కోసం కల్యాణ మండపాన్ని భారీగా ఏర్పాటు చేశారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా ఆలయం లోపల, బయట చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానం షెడ్లు ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులు స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.













