టీయూ-142 యుద్ధ విమానాన్ని స్వీకరించిన సీఎం చంద్రబాబు
విశాఖపట్నంలో టీయూ-142 యుద్ధ విమాన స్వీకరణ కార్యక్రమం జరిగింది. యుద్ధ విమానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేవీ చరిత్రలో ఇవాళా గుర్తిండిపోయే రోజన్నారు. గతంలో మా హయాంలోనే కురుసుర సబ్‌మెరైన్ తీసుకొచ్చామన్నారు. బీచ్ రోడ్డులోని కురుసుర సబ్‌మెరైన్ ఎదుట టీయూ-142 యుద్ధ విమానాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. టీయూ-142 పర్యాటకాన్ని బాగా ఆకర్షిస్తుందని ఆయన పేర్కొన్నారు. వెంచర్ టూరిజంలో నేవీతో కలిసి పనిచేస్తామని, నేవీకి అన్ని విధాల సహకరిస్తామని తెలిపారు. వాటర్ స్పోర్ట్స్‌లో ఏపీని నెంబర్‌వన్‌గా మార్చుతామని చంద్రబాబు ఆకాంక్షించారు.













