రెండో విడత భూసేకరణకు నేడు నోటిఫికేషన్
అమరావతిలో రెండో దశ భూసేకరణకు నేడు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. తుళ్లూరులో 96, రాయపూడిలో 224 ఎకరాల భూమి సేకరణకు నేడు నోటిఫికేషన్విడుదల చేయనున్నది. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే 60 రోజులలోగా తెలియజేయాలని నోటిఫికేషన్ లో కోరనుంది. అంతే కాకుండా కలెక్టర్ అనుమతి లేకుండా ఈభూములకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు నిర్వహించరాదని కూడా నోటిషికేషన్ పేర్కొంటుంది.






