దేవినేని నెహ్రూ కన్నుమూత
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ నేడు ఉదయం కన్నుమూశారు. కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని జంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో నేడు ఉదయం 5 గంటల సమయంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన ఆసలు పేరు దేవినేని రాజశేఖర్. నెహ్రూ ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. మరణవార్త తెలుసుకున్న నెహ్రూ కుటుంబసభ్యులు హటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. నెహ్రు ఆకస్మిక మృతితో ఆయన అనుచరులు, అభిమానులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. విజయవాడ రాజకీయాల్లో నెహ్రు కీలక పాత్ర పోషిస్తున్న నెహ్రు కంకిపాడు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఒకసారి శాసనసభకు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు.













