సీఎం ఛాంబర్ లో టీడీపీ సంబరాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఛాంబర్లో తెలుగుదేశం పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల్లో విజయం పట్ల నేతలు, మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాస్‌రావును చంద్రబాబు ప్రశంసించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయంపట్ల తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ వర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కార్యకర్తలదే అన్నారు. కడప జిల్లాల్లో బీటెక్ రవి విజయానికి నాయకులు, కార్యకర్తలు శ్రమించారన్నారు.













