చంద్రబాబును అభినందించిన సుమిత్రా మహాజన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభినందించారు. అమరావతిలో అంబేద్కర్ స్మృతివనం నిర్మించాలనే ఆలోచన చాలా గొప్పదని, ఈ విషయంలో బాబును అభినందిస్తున్నానని ఆమె తెలిపారు. ఈ స్మృతివనం కోసం యమునా నది నుంచి నీటిని, పార్లమెంట్ ప్రాంగణం నుంచి మట్టిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధుల బృందం సేకరించింది. పార్లమెంటు ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సుమిత్రా మహాజన్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు మట్టిని అందుకున్నారు.






