శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామ నవమి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం వైభవంగా జరిగింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీసీతాలక్ష్మణ ఆంజనేయస్వామి సమేత శ్రీరామంచద్రుడికి మందిరంలోని రంగనాయకుల మండపంలో పండితులు, వేద పారాయణం మధ్య, అర్చకులు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల మధ్య శ్రీరామచంద్రుడికి తిరువీధుల్లో హనుమంత వాహనసేవ కనులపండువగా సాగింది. అనంతరం శ్రీరామచంద్రుడు శ్రీసీతామహాదేవి, శ్రీలక్ష్మణస్వామి సమేతంగా ఆస్థానానికి వేంచేశారు. రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య వైదికులు, అర్చకస్వాములు శ్రీరామనవమి ఆస్థానాన్ని బంగారు వాకిలి ఎదుట వైభవంగా నిర్వహించారు.













