2019 కల్లా పోలవరం పూర్తి : చంద్రబాబు
2019 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని, ఇంకా వేగం పెంచాల్సిన అవసరముందని అన్నారు. ఇప్పటికే 5 గేట్లు నిర్మాణం పూర్తయిందని, మొత్తం 48 గేట్ల నిర్మాణం పూర్తికావాల్సి ఉందన్నారు. ఒకచోట పని ఆగిపోతే రూ.కోట్లలో నష్టం వస్తోందని అన్నారు. సమిష్టిగా పనిచేస్తే ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుందని వ్యాఖ్యానించారు. కొన్ని దుష్టశక్తులు నిర్మాణానికి అడ్డుపడుతున్నాయని, ప్రాజెక్టు పూర్తికావడం వారికి ఇష్టం లేదని మండిపడ్డారు. పోలవరం పూర్తయితే పర్యాటకం ఏర్పడుతుందని చెప్పారు.













