విశాఖలో జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేడుకలు
విశాఖపట్నంలో జాతీయ బాలల చలన చిత్రోత్సవం -2017 ఈ నెల 7 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు.ఈ వేడుకలను కేంద్ర పట్టణాభివృద్ధి, సమచార మంత్రిత్వశాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారు. కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. విశాఖలోని వుడా బాలల ప్రాంగణంలో ప్రారంభ కార్యక్రమానికి కేంద్రమంత్రితో పాటు ఇతర ప్రముఖులు, బాల నటులు పాల్గొంటారు. శాణు చిత్రంతో ప్రారంభం కానున్న ఈ బాలల చిత్రోత్సవంలో పలు తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల బాలల చిత్రాలు ప్రదర్శించనున్నారు. విశాఖలోని వుడా చిల్డ్ర్‌న్స్ ఎరీనాలోని థియేటర్‌తోపాటు, వరుణ్బీచ్, సీఎంఆర్ సెంట్రల్, చిత్రాలయ సినిమాహాళ్లల్లో మూడు రోజుల పాటు బాలల చిత్రాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు.













