6 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: లోకేశ్
రానున్న రెండేళ్లలో ఏపీకి ప్రతిష్ఠాత్మక ఐటీ కంపెనీలను తీసుకువచ్చి లక్ష ఉద్యోగాలు ఇప్పిస్తానని ఐటీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అన్ని రంగాల్లోనూ ఉపాధి అవకాశాలు మెరుగుపర్చి, రానున్న రెండేళ్లలో ఏపీలో 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దేశంలో మొదటిసారిగా ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించిన ఫాక్స్కాన్ కంపెనీలో 9,500 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరామని తెలిపారు. ఉత్తర కొరియాకు చెందిన ‘కియా’ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందని, ఈ సంస్థ ద్వారా 25 వేలమందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.













