పదేళ్లలోనే విశాఖను ఐటీ హబ్ గా మారుస్తాం : లోకేశ్
పదేళ్లలోనే విశాఖ నగరం ఐటీ హబ్ గా మారుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. గూగుల్ (Google) ఆధ్వర్యంలో విశాఖలో ఏఐ శక్తి కాన్ క్లేవ్ (AI Shakti Conclave) జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొని మాట్లాడారు. ఐటీ అభివృద్ధిలో హైదరాబాద్ (Hyderabad) కంటే మెరుగ్గా విశాఖ (Visakha)ను మారుస్తాం. విశాఖలో పూర్తి ఎకో సిస్టమ్ తయారు చేస్తున్నాం. డేటా సెంటర్లు తేవడమే కాదు వాటి నిర్వహణ కూడా కీలకం. పరిశ్రమలను తెచ్చి యువతకు ఉపాధి కల్పించడమే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన ప్రతి పరిశ్రమకు ప్రభుత్వం అండదండలు ఉంటాయి. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 26 శాతం ఏపీకే వస్తున్నాయి. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు, సంస్థల పురోగతిపై ప్రతి వారం సమీక్ష చేపడతాం అని అన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








