క్యారియర్ ఎండీ సుందర్ నారాయణన్ తో మంత్రి లోకేష్ భేటీ
విశాఖపట్నం: క్యారియర్ ఎండీ సుందర్ నారాయణన్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. ఐటీ, లాజిస్టిక్స్, పారిశ్రామిక రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో క్యారియర్ సంస్థ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు. ఏఐ-డ్రివెన్ సొల్యూషన్స్ డిమాండ్‌ను తీర్చడానికి డేటా సెంటర్ కూలింగ్, ప్రిడిక్టివ్ HVAC సిస్టమ్‌లకు అధునాతన మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయండి. స్పెసిఫికేషన్ల కోసం పెద్ద స్థాయి మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీతో గ్లోబల్ రిఫ్రిజరేషన్& కోల్డ్-చైన్ ఎక్స్పోర్ట్ హబ్ ను ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. క్యారియర్ గ్లోబల్ కార్పోరేషన్ ఇంటిలిజెంట్ క్లైమేట్, ఎనర్జీ సొల్యూషన్లలో గ్లోబల్ లీడర్ గా ఉంది. HVAC, రిఫ్రిజరేషన్, భవన ఆటోమేషన్ సిస్టమ్‌లను ప్రపంచవ్యాప్తంగా అందిస్తుంది. క్యారియర్ సంస్థ ఏప్రిల్ 2026 నాటికి $52.92 బిలియన్ల మార్కెట్ క్యాపిటల్ కలిగి ఉంది.









