సీఎం చంద్రబాబు, పవన్ నివాసాలకు వెళ్లిన మోదీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నివాసాలకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వెళ్లారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు, పవన్ ఇళ్లకు వెళ్లారు. తొలుత పవన్ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. సైనస్ సమస్య కారణంగా పవన్ కల్యాణ్‌కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇంటికి మోదీ వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానికి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేశ్ (Minister Lokesh) ఆత్మీయ స్వాగతం పలికారు. గంటకు పైగా మోదీ అక్కడ ఉన్నారు. వివిధ అంశాలపై చంద్రబాబుతో ఆయన సమాలోచనలు జరిపారు.


ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








