అమరావతిలో హైకోర్టు
అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. నూతన భవనాల నిర్మాణం పూర్తయ్యాక హైకోర్టు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో హైకోర్టు అంశాన్ని తోట నర్సింహం ప్రస్తావించారు. తోట నర్సింహు ప్రశ్నకు రవిశంకర్ ప్రసాద్ సమాధానం ఇచ్చారు. విభజన చట్టం ప్రకారం హైకోర్టు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వ్యక్తిగతంగా ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడుతూనే ఉన్నానని తెలిపారు.






