విశాఖలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంస్థ అయిన పుణేలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విభాగాన్ని విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. విశాఖలోని ఆకాశవాణి కేంద్రంలో 47వ ప్రాంతీయ వార్తా విభాగాన్ని వెంకయ్య నాయుడు ప్రారంభించారు. విశాఖ కేంద్రం నుంచి ఇకపై ప్రతిరోజూ రాత్రి ఎనిమిదింటికి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయని పేర్కొన్నారు. ఆకాశవాణి అత్యంత విశ్వసనీయమైనదని, అత్యధికులకు వార్తలను చేరవేసే శక్తి ఉన్న మాధ్యమమని వివరించారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో సినీ రంగ పరిశ్రమకు అవసరమైన పలు కోర్సులను విశాఖలోనే నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.













