ప్రజా సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం : మంత్రి దుర్గేశ్
ప్రజల ఆరోగ్య భద్రత, సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేశ్ (Kandula Durgesh) అన్నారు. తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) నిడదవోలు మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 54 మంది లబ్ధిదారులకు రూ.26.41 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కుల (Cheques)ను ఆయన పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 835 మంది లబ్ధిదారులకు రూ.5.93 కోట్ల మేర సీఎం రిలీఫ్ ఫండ్ (CM Relief Fund) అందజేసినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి








