సైబరాబాద్ తరహాలో అమరావతి అభివృద్ధి : చంద్రబాబు
ప్రపంచ ఐటి రంగానికి భారతదేశం ఐటి హబ్‌గా మారిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ నగర శివార్లలోని శంకరాపురం గ్రామంలో ఉన్న ఐఎంటి కళాశాల వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఐటీ రంగంలో అనేక ఉద్యోగావాకాశాలు ఉన్నాయని తెలిపారు. తన హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అయిన హైదరాబాద్‌లో సైబరాబాద్ ప్రాంతాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దామని అన్నారు. ప్రస్తుతం అమరావతిని కూడా అదే పద్ధతిలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. అమరావతిలో ఐటి అభివృద్ధి కోసం అందరూ స్వచ్ఛందంగా తోడ్పాటునందిస్తున్నారని పేర్కొన్నారు. ఐటీ రంగంలో అత్యధిక శాతం యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇండియావైపు చూస్తున్నాయని దేశానికి అమరావతిని ఐటీ హబ్‌గా మరుస్తానని అన్నారు. అమరావతిలో ప్రపంచస్థాయి ఐటి పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తాను ముందుచూపుతో హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమనాశ్రయం, ఔటర్‌రింగ్‌రోడ్డు ఏర్పాటుకు శ్రీకారం చుట్టామనని అన్నారు.













