ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ప్రారంభం
ప్రభుత్వాస్పత్రులను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కోట్ల విలువైన పరికరాలను ఉపయోగించుకోకుండామూలన పడవేసే దురవస్థ ఇక ఉండదని, ప్రభుత్వాస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రులను మించి అధునాతనంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగాశుక్రవారం సచివాలయంలో ఆయన పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ‘ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాల’ను ప్రారంభించారు. ఇదే వేదికపై ఆరోగ్య రక్ష పథకానికి శ్రీకారం చుట్టారు.
ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు అనారోగ్యానికి నిలయాలుగా ఉండేవని, ఈ పరిస్థితిని తాము సమూలంగా మార్చివేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వాస్పత్రులలోరోగులు నిద్రించే బెడ్స్ మీద దుప్పట్లు, దిండు గలీబులను ప్రతిరోజూ మార్చేందుకు వీలుగా వారానికి ఏడు రంగులలో దుప్పట్లు, గలీబులు మార్చేందుకు ఏర్పాట్లుచేశామని సీఎం వివరించారు.













