ఎవరికైనా అసంతృప్తి ఉంటే నాతో చెప్పండి
ఎవరికైనా అసంతృప్తి ఉంటే తనతో డైరెక్ట్‌గా చెప్పాల్సిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. కేబినేట్ పునర్వ్యవస్థీకరణ అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కొందరి నేతల అలకపై ఆయన స్పందిస్తూ, ఏదైనా ఉంటే తనతో నేరుగా చెప్పిలని పార్టీ నేతలకు సూచించారు. నిన్న కొందరు శృతి మించిన ప్రవర్తించిన తీరు బాధ కలిగించిందన్నారు. ఈ విధంగా వ్యవహరించటం సరికాదని అన్నారు. మనందరి లక్ష్యం 2019 ఎన్నికల్లో విజయం సాధించడమే అన్నారు. 26 మందికి మంచి మంత్రివర్గంలో స్థానం కల్పించలేమన్నారు. మంత్రివర్గంలో అన్ని ప్రాంతాలు, వర్గాలకు ప్రాధాన్యం కల్పించాం. కొందరి అర్హత ఉన్నా ఇవ్వలేని పరిస్థితి తలెత్తిందన్నారు. ఇవన్నీ తెలిసీ క్రమశిక్షణ తప్పేలా వ్యవహరించటం ఎంత వరకు సబబు అని అన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమనుకుంటే సహించనని హెచ్చరించారు. పార్టీ బాగు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకైనా వెనుకాడను. ప్రజలు బాగుండాలంటే పార్టీ బాగుండాలని అన్నారు.













