పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అఖిలప్రియ
టూరిజం, తెలుగు భాష, సాంస్కృతిక శాఖల మంత్రిగా భూమా అఖిలప్రియ ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. అమెకు టూరిజం శాఖ ఉన్నతాధికారులు, శ్రీకాంత్, గిరిజా శంకర్, ఏపీటీడీసీ చైర్మన్ జయరామిరెడ్డి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా నేతలు, భూమా అనుచరులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఆర్టీ, జీకేఆర్, మినర్వా, బాలజీ రిసార్ట్స్లతో పర్యాటక శాఖ ఒప్పందం, కళాకారులకు ఆర్థిక సాయం దస్త్రాలపై మంత్రి తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను బాధ్యతలు తీసుకున్న రోజే అంబేడ్కర్ జయంతి కావడం ఆనందంగా ఉందన్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం అభివృద్ధికి అవకాశాలు మెరుగయ్యాయన్నారు. చంద్రబాబు విజన్‌కు అనుగుణంగా తాను పనిచేస్తానన్నారు. త్వరలో విశాఖ- అరకు మధ్య గ్లాస్ కోచ్ రైలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.













