కోలాటంలో ఏపీఎస్డబ్ల్యూ గిన్నిస్ రికార్డు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గురుకుల పాఠశాలల విద్యార్థులు గిన్నిస్ రికార్డుకు చేరువయ్యారు. అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలోని ఆయా విద్యాసంస్థలకు చెందిన 2,315 మంది విద్యార్థులు విజయవాడలోని ఇందిరీగాంధీ మున్సిపల్ స్టేడియంలో 125 గ్రూపులుగా జడకోలాటం ఆడారు. గంటపాటు సాగిన ప్రక్రియలో మొదటిగా కర్రల కోలాటం, తర్వాత 36 నిముషాలపాటు జడ కోలాటం చేశారు. లయబద్ధంగా సాగిన ఈ ప్రకియను సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు గిన్నిస్ రికార్డుకు పంపుతారు. ప్రస్తుతం 250 మందితో గిన్నిస్ రికార్డు ఉంది. దీన్ని బ్రేక్ చేసేలా జడల కోలాటాన్ని నిర్వహించారు.













