కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి ఒక కీలక ఘట్టం ముగిసింది. కేబినెట్‌ను తొలిసారిగా పునర్వవస్థీకరించారు. ఈ రీషఫిలింగ్ లో ఐదుగురు మంత్రులను తొలగించేసిన చంద్రబాబు… కొత్తగా 11 మందికి అవకాశం కల్పించారు. కొత్త మంత్రుల చేత తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ వెలగపూడిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక మీద ప్రమాణం చేయించారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏపీలో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వెలగపూడి సచివాలయం పక్కన ఏర్పాటుచేసిన వేదికపై గవర్నర్ వీరి చేత ప్రమాణం స్వీకారం చేయించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేశ్.. తన తండ్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. లోకేశ్‌తో పాటు కిమిడి కళా వెంకట్రావు (శ్రీకాకుళం), సుజయకృష్ణ రంగారావు (విజయనగరం), పితాని సత్యనారాయణ (ప. గోదావరి), జవహర్ (పశ్చిమ గోదావరి), నక్కా ఆనందబాబు (గుంటూరు), సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి (నెల్లూరు), అమర్నాథ రెడ్డి (చిత్తూరు), కాల్వ శ్రీనివాస్ (అనంతపురం), ఆదినారాయణ రెడ్డి (కడప), భూమా అఖిలప్రియ (కర్నూలు) ప్రమాణ స్వీకారం చేశారు.
పాదాభివందనాలు
ప్రమాణ స్వీకారం అనంతరం కొందరు నేతలు చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ తండ్రికి, గవర్నర్‌కు పాదాభివందనం చేశారు. ఇక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నక్కా ఆనందబాబు, జవహార్‌లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాదాభివందనం చేశారు.













